Andhra Pradesh: కంటైనర్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

Andhra Pradesh: కంటైనర్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
x
Highlights

గుంటూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. మేడికొండూరు మండలం పాలడుగు బైపాస్ రోడ్ వద్ద వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు కంటైనర్ ట్రక్కును ఢీకొట్టింది.

గుంటూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. మేడికొండూరు మండలం పాలడుగు బైపాస్ రోడ్ వద్ద వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు కంటైనర్ ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్, కంటైనర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే బస్సులోని పది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో, మాచెర్ల డిపో ఆర్టీసీ బస్సు గుంటూరు నుండి మాచెర్ల వైపు వెళుతుండగా, ట్రక్ సత్తెనపల్లి నుండి గుంటూరు వైపు వెళుతోంది. సంఘటనలో ట్రక్ క్యాబిన్ నుజ్జు నుజ్జు అయింది.

ఓవర్ స్పీడే ప్రమాదానికి ప్రధాన కారణం గా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. దారికి అడ్డంగా ఉన్న ఈ రెండు వాహనాలను క్రేన్ సహాయంతో తొలగించారు. డ్రైవర్లను ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు మినహా ఏమి కాలేదని పోలీసులు తెలిపారు. వారిని కూడా ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories