జేసీ దివాకర్ రెడ్డికి మరో షాక్.. ట్రావెల్స్ బస్సులు సీజ్!

జేసీ దివాకర్ రెడ్డికి మరో షాక్.. ట్రావెల్స్ బస్సులు సీజ్!
x
Highlights

అనంతపూర్ మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకుడు జెసి దివాకర్ రెడ్డి "దివాకర్ ట్రావెల్స్" కు చెందిన 5 బస్సులను ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ అధికారులు స్వాధీనం...

అనంతపూర్ మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకుడు జెసి దివాకర్ రెడ్డి "దివాకర్ ట్రావెల్స్" కు చెందిన 5 బస్సులను ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ బస్సులను నడుపుతున్నట్టు అధికారులు గుర్తించారు. దాంతో ముందుగా నోటీసులు ఇచ్చి ఈ బస్సులను సీజ్ చేశారు. అనంతపూర్ జిల్లా రవాణా కమిషనర్ శివరామ్ ప్రసాద్ అలాగే రవాణా శాఖ అధికారులు జెసి దివాకర్ రెడ్డి చెందిన బస్సులపై దాడులు నిర్వహించారు. ఇంటర్ స్టేట్ క్యారియర్ పర్మిట్ లేకపోవడంతో వారు 5 బస్సులను గుర్తించి సీజ్ చేశారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, ఇష్టానుసారం టికెట్ల ధరలు వసూలు చేయడం తదితర అంశాలకు సంబంధించి దివాకర్ ట్రావెల్స్ కేసులు నమోదయ్యాయి.

ఇటీవలి తనిఖీలు నిర్వహించిన రవాణా శాఖ అధికారులు దివాకర్ ట్రావెల్స్ కు చెందిన 36 బస్సులను స్వాధీనం చేసుకున్నారు.. అందులో దివాకర్ ట్రావెల్స్ బస్సులు కూడా ఉన్నాయి. నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఇప్పటికే "దివాకర్ ట్రావెల్స్" పై అనేక కేసులు నమోదు చేశారు. కాగా గతంలో కూడా ఈ ట్రావెల్స్ కు చెందిన బస్సులను కొన్నింటికి లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. తాజాగా ఐదు బస్సులను సీజ్ చేయడంతో రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

ఇదిలావుంటే తన ట్రావెల్స్ కు చెందిన బస్సులను సీజ్ చేయడంపై గతంలో జేసీ మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నో ట్రావెల్స్ ఉండగా.. జగన్‌కు నా బస్సులే కనిపిస్తున్నాయా? అని అన్నారు. తనకు ఉన్న బస్సుల్లో ఇప్పటి వరకు చాలా బస్సులు సీజ్ చేశారని అన్నారు. చిన్న చిన్న లోటుపాట్లు ఆర్టీసీతో సహా ఏ ట్రావెల్స్‌కైనా సహజమన్నారు. ఫైన్‌తో పోయేదానికి సీజ్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని దివాకర్ రెడ్డి రవాణా శాఖా అధికారులను ప్రశ్నించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories