Gudem Kotha Veedhi: మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి

Gudem Kotha Veedhi: మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి
x
Highlights

గిరిజన మహిళల ఆర్థిక అభివృద్ధికి సీఆర్పీఎఫ్ తరఫున కృషి చేస్తున్నట్లు 234 బెటాలియన్ కమాండెంట్ ఆర్ఎస్ బాలాపుర్కర్ చెప్పారు.

గూడెంకొత్తవీధి: గిరిజన మహిళల ఆర్థిక అభివృద్ధికి సీఆర్పీఎఫ్ తరఫున కృషి చేస్తున్నట్లు 234 బెటాలియన్ కమాండెంట్ ఆర్ఎస్ బాలాపుర్కర్ చెప్పారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా గూడెం కొత్తవీధి, పెదవలస పోలీస్ స్టేషన్లలో చింతపల్లి ఏఎస్పీ సతీష్ కుమార్ తో కలిసి మహిళలకు కుట్టుమిషన్లు, విద్యార్థులకు సైకిళ్లు, గిరిజనులకు తాగునీటి ట్యాంకులు పంపిణీ చేశారు.

భద్రతతోపాటు ప్రజల అవసరాలు తీర్చడమే లక్ష్యంగా సీఆర్పీఎఫ్ పలు కార్యక్రమాలు చేపడుతుందన్నారు. సీఆర్పీఎఫ్ 234 బెటాలియన్ ద్వితీయ కమాండెంట్ నరేష్ కుమార్ యాదవ్, సహాయ కమాండెంట్ అనంతరాజు బన్సి , డిప్యూటీ కమాండెంట్ ఎస్ఆర్ మీనా, వైద్యాధికారి సాయి సింధు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories