పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్ బర్త్‌డే వేడుకలు

Rowdy Sheeter Birthday Celebrations at the Police Station
x

పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్ బర్త్‌డే వేడుకలు

Highlights

Eluru: రౌడీషీటర్ సూరి పుట్టినరోజు కావడంతో స్టేషన్ ఆవరణలోనే సంబరాలు

Eluru: రౌడీ షీటర్లు బరితెగిస్తున్నారు. ఏకంగా పోలీస్ స్టేషన్‌ ఆవరణలోనే బర్త్‌డే వేడుకలు జరుపుకున్నారు. ఏలూరు టు టౌన్ పోలీస్ స్టేషన్‌ ఆవరణలో ఈ ఘటన జరిగింది. కొద్దిరోజుల క్రితం టు టౌన్ పీఎస్ పరిధిలోని రౌడీషీటర్లను కౌన్సిలింగ్ కోసం స్టేషన్‌కు పిలిపించారు.

ఆ సమయంలో స్టేషన్‌లో పోలీసులు ఇతర విధుల్లో ఉన్నారు. సూరి అనే రౌడీషీటర్‌ పుట్టిన రోజు కావడంతో స్నేహితులతో కలిసి కేక్‌కట్‌ చేశాడు. పోలీస్ స్టేషన్‌లోనే రౌడీలు ఇంత సాహసం చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ సమయంలో పోలీసులు ఎవరూ లేకపోవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. రౌడీషీటర్ బర్త్ డే వేడుకలను సహచరులు సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories