Roja: టెంపుల్ టూరిజంలో దేశంలోనే ఏపీ మూడోస్థానం

Roja Says AP Ranks Third in Temple Tourism in the Country
x

Roja: టెంపుల్ టూరిజంలో దేశంలోనే ఏపీ మూడోస్థానం

Highlights

Roja: నూతనంగా మరో 50 ప్రాంతాల్లో బోటింగ్ సదుపాయం

Roja: మంత్రిగా ఏడాది కాలం పూర్తి చేసుకోవడంపై ఏపీ టూరిజం శాఖా మంత్రి రోజా ఆనందం వ్యక్తం చేశారు .సీఎం జగన్ ఆశీస్సులతోనే మంత్రిగా విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్నానని తెలిపారు. టూరిజానికి సంబంధించి ఏడాది కాలంలో ప్రతిష్టాత్మక పర్యటనలు, సదస్సుల్లో పాల్గొన్నామని, వాటితో పాటు ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని అన్నారు . గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, జీ20 సమ్మిట్ లో కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.

త్వరలో టెంపుల్ టూరిజంతోపాటు విశాఖలో నేచురల్ టూరిజాన్ని డెవలప్ చేస్తున్నామని తెలిపారు ,నూతనంగా 50ప్రాంతాల్లో బోటింగ్ సదుపాయం రాబోతోందని అన్నారు. టెంపుల్ టూరిజంలో ఏపీ దేశంలోనే మూడవస్థానంలో ఉందని టూరిజంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని రోజా తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories