తిరుమలలో అన్యమత గుర్తు కలకలం.. శిలువ గుర్తుతో తిరుమలకు వచ్చిన మంత్రి రోజా ఫోటో్గ్రాఫర్

Roja Photographer Violated Rules In Tirumala
x

తిరుమలలో అన్యమత గుర్తు కలకలం.. శిలువ గుర్తుతో తిరుమలకు వచ్చిన మంత్రి రోజా ఫోటో్గ్రాఫర్ 

Highlights

Roja Photographer: అన్యమత గుర్తులు తిరుమలకు తీసుకుని రావద్దని నిబంధన

Roja Photographer: తిరుమలలో అన్యమత గుర్తు కలకలంరేపింది. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా అన్యమత శిలువ గుర్తుతో మంత్రి రోజా ఫోటో గ్రాఫర్ తిరుమలకు రావడం చర్చనీయాంశం అయ్యింది. మంత్రి రోజా ఉదయం శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చారు. మంత్రి పర్సనల్ ఫోటోగ్రాఫర్ స్టెయిన్‌ కూడా తిరుమలకు వచ్చాడు. ఈ క్రమంలోనే స్టెయిన్‌ మెడలో అన్యమత గుర్తు కలిగిన చైన్ కనిపించంది. తిరుమల శ్రీవారి ఆలయంకు అభిముఖంగా ఉన్న గొల్లమండపం దగ్గర ఫోటోగ్రాఫర్ షేన్ మెడలో చైన్ ఉన్న వీడియో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో ఫొటోలు తీసేందుకు ఫొటోగ్రాఫర్‌ స్టెయిన్‌ అన్యమత గుర్తు ఉన్న గొలుసుతో గొల్లమండపం ఎక్కారు. దీంతో ఈ చైన్ బయటపడింది.

తిరుమలలో అన్యమత గుర్తులు, రాజకీయ గుర్తులు, జెండాలు తిరుమలకు తీసుకుని రావొద్దని నిషేధం ఉన్నప్పటికి సాక్షాత్తూ మంత్రి పర్సనల్ ఫోటో గ్రాఫర్ షేన్ అన్యమత గుర్తు కలిగిన చైన్‌తో తిరుమలలో తిరుగుతుండడంపై వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారంపై టీటీడీ విజిలెన్స్ సిబ్బంది స్పందించి చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories