Roja: కేబినెట్ బెర్త్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న రోజా

Roja had High Hopes for Cabinet Minister | AP News Today
x

Roja: కేబినెట్ బెర్త్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న రోజా 

Highlights

Roja: రోజాకు కేబినెట్ బెర్త్ దక్కుతుందా లేదా అన్న చర్చ

Roja: వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు ఈసారైనా మంత్రివర్గంలో చోటు దక్కుతుందా లేదా అన్న చర్చ ఇప్పుడు వైసీపీ వర్గాల్లో జోరుగా విన్పిస్తోంది. రోజాకు కాకుంటే ఇంకెవరికి ఇస్తారని పార్టీ నేతలు పెద్ద ఎత్తున చెవులు కొరుక్కుంటున్నారు. అయితే జిల్లా ఈక్వేషన్లో రోజాకు కేబినెట్ బెర్త్ కేటాయించడం అంత వీజీ కాదు. కానీ పార్టీ కోసం గట్టిగా కొట్లాడిన రోజాకు కేబినెట్ బెర్త్ పై కోటి ఆశలు పెట్టుకున్నారు.

మొదటిసారి విస్తరణలోనే జూనియర్లకు అవకాశమిచ్చారని తనకు కేబినెట్లో చోటు ఇవ్వలేదని రోజా అలకబూనారు. నాటి పరిస్థితుల్లో రోజాకు ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా ఇచ్చి జగన్ గౌరవించారు. తాజా విస్తరణలోనైనా రోజాకు చోటు దక్కుతుందని ఎంతో ఆశగా ఉన్నారు. ఐతే సీఎం జగన్మోహన్ రెడ్డి నేనున్నానమ్మా అంటూ ఇచ్చిన భరోసాతో రోజా గట్టి నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories