Delhi: ఢిల్లీ సుల్తాన్‌పురి ఏరియాలో నిన్న రోడ్డు ప్రమాదం

Road Accident Yesterday In Sultanpuri Area Of Delhi
x

Delhi: ఢిల్లీ సుల్తాన్‌పురి ఏరియాలో నిన్న రోడ్డు ప్రమాదం

Highlights

Delhi: నిన్న ఓ మహిళను ఢీకొట్టిన కారు

Delhi: ఢిల్లీలో కారు ప్రమాద ఘటనపై ఆప్ నేతలు మండిపడ్డారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఇంటి ముందు ఆప్ శ్రేణులు ఆందోళనకు దిగారు. నిన్న ఓ మహిళను కారు ఢీకొట్టి కిలో మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. ఢిల్లీ సుల్తాన్‌పురి ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులకు కోర్టు 3 రోజులు కస్టడీ విధించింది. నిందితులు దీపక్‌ఖన్నా, అమిత్‌ఖన్నా, కిషన్‌, మిథున్, మనోజ్‌ మిట్టల్‌గా గుర్తించారు. రోడ్డు ప్రమాద ఘటనను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఖండించారు. నిందితుడిని ఉరి తీయాలన్నారు. హిట్ అండ్ రన్ కేసుపై ఢిల్లీ వాసులు భగ్గుమంటున్నారు. లెఫ్టినెంట్ ఇంటి దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories