కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident in Kurnool District
x

Representational Image

Highlights

* మినీ బస్సు-లారీ ఢీ, 14 మంది మృతి * నలుగురికి తీవ్రగాయాలు * క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలింపు

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో- లారీ ఢీ కొన్న ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఓ చిన్నారితో పాటు, 8 మంది మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. ప్రమాదంలో టెంపోలో 18 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. చిత్తూరు నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులంతా మదనపల్లె వాసులుగా గుర్తించారు. డ్రైవర్‌ నిద్రమత్తే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories