కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి...

Road Accident in Kakinada
x

కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి...

Highlights

Kakinada: మరో 11 మందికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

Kakinada: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. తుని మండలం వెలమకొత్తూరు వద్ద ఆగివున్న లారీని బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. దీంతో మృతుల సంఖ్య 3కి చేరింది. మరో 11 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విశాఖపట్నం నుంచి శ్రీరంగపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories