గుంతకల్లు లో బోల్తా పడిన ఆటో.. మహిళా మృతి!

X
ప్రతీకాత్మక చిత్రం
Highlights
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ శివారులోని 63వ జాతీయ రహదారిపై ఆటో బోల్తాపడింది.
K V D Varma17 Jan 2021 3:31 AM GMT
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ శివారులోని 63వ జాతీయ రహదారిపై ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 13మందికి తీవ్రగాయాలు అయ్యాయి. వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామానికి చెందిన 17 మంది కూలీలు ఆటోలో కర్నూలు జిల్లాలోని గుమ్మన్నూరు గ్రామానికి వెళ్తున్నారు. రహదారికి అడ్డంగా ఉన్న మట్టి కుప్పలను గమనించని ఆటో డ్రైవర్ వేగంగా వెళ్లాడు. దీంతో ఆటో 3సార్లు పల్టీలు కొట్టింది. స్థానికులు క్షతగాత్రులను గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రమణమ్మ అనే మహిళా మార్గ మధ్యలోనే ప్రాణాలు విడిచింది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Web TitleRoad accident in Gunthakallu caused woman death
Next Story