Road Accident: చిత్తూరు జిల్లా వి.కోటలో మూడు లారీల బీభత్సం

Road Accident In Chittoor District
x

Road Accident: చిత్తూరు జిల్లా వి.కోటలో మూడు లారీల బీభత్సం

Highlights

Road Accident: తిరుపతి-కుప్పం మార్గంలో భారీగా స్తంభించిన ట్రాఫిక్

Road Accident: చిత్తూరు జిల్లా వి.కోట లో మూడు లారీలు రోడ్డుపై బీభత్సం సృష్టించాయి. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు. తిరుపతి కుప్పం మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వి కోట సమీపంలోని జౌనిపల్లి క్రాస్ లో అతివేగంతో వెళ్తున్న రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ఆటోను తప్పించబోయి మరో లారీ ఆ రెండు లారీలను ఢీకొట్టి పల్టీ కొట్టింది. క్షణాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. రోడ్డుపై చోటు చేసుకున్న ఈ బీభత్సంతో వాహనదారులు,ప్రయాణికులు హడలి పోయారు. ఆ సమయంలో అక్కడ తప్పించుకున్న ఆటోలో ఉన్న14 మంది ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. లారీ డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసారు.

Show Full Article
Print Article
Next Story
More Stories