Top
logo

చిత్తూరు జిల్లాలో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం

చిత్తూరు జిల్లాలో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం
X
Highlights

చిత్తూరు జిల్లాలో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెనుమూరులో ద్విచక్రవాహనాన్ని ఓ లారీ ఢీకొట్టింది....

చిత్తూరు జిల్లాలో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెనుమూరులో ద్విచక్రవాహనాన్ని ఓ లారీ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతులు తిరుపతి జీవకోనకు చెందిన వారుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరొకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా జిల్లాలోని బంగారుపాళ్యం మండలం మొగిలి ఘాట్‌ వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. రెండు రోజుల వ్యవధిలోనే ప్రమాదం భారిన పడి 13 మంది జిల్లా వాసులు మృతిచెందడం ఆందోళనకు గురిచేస్తోంది.

Next Story