ఒంగోలులో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి

ఒంగోలులో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి
x
Highlights

* ప్రకాశం జిల్లా ఒంగోలు సంఘమిత్ర ఆస్పత్రి దగ్గర రోడ్డుప్రమాదం * ఆగిఉన్న లారీని ఢీకొట్టిన మ్యాక్సీ వాహనం * వెనుక నుంచి వాహనాన్ని ఢీకొట్టిన మరో లారీ ఇద్దరు మృతి, 8 మందికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు * ఘటనలో నుజ్జునుజ్జు అయిన మ్యాక్సీ వాహనం * వాహనంలో చిక్కుకున్నవారిని బయటకు తీస్తున్న పోలీసులు

ప్రకాశం జిల్లా ఒంగోలు సంఘమిత్ర ఆస్పత్రి సమీపంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆగిఉన్న లారీని మ్యాక్సీ వాహనం ఢీకొట్టింది. అదే సమయంలో మ్యాక్సీ వాహనాన్ని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. మ్యాక్సీ వాహనంలో ఇరుక్కున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. బాధితులు తిరుపతి నుంచి తెనాలి వెళ్తున్న పెళ్లి బృందంగా తెలిసింది. మరోవైపు ఈ ఘటనలో మ్యాక్సీ వాహనం నుజ్జు నుజ్జు అయింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. రెండు లారీల డ్రైవర్లు.. ప్రమాదస్థలం నుంచి పరారైనట్టు గుర్తించారు.

పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం ప్రమాదం ఇలా జరిగింది. గుంటూరు జిల్లా తెనాలి మండలం పెనుపాడు గ్రామానికి చెందిన ఒక జంటకు శనివారం తిరుమలలో వివాహమైంది. అనంతరం వధూవరులు ఒక వాహనంలో, రెండు కుటుంబాల బంధువులు 10 మంది మరో వాహనంలో తెనాలికి తిరుగు ప్రయాణమయ్యారు. ఆదివారం తెల్లవారుజామున ఒంగోలు సమీపంలోకి చేరుకోగానే బంధువులు ప్రయాణిస్తున్న వాహనం ముందు వెళ్తున్న లారీ డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేశాడు. దీంతో పెళ్లి బృందం వాహనం లారీని ఢీకొట్టింది. దాన్నుంచి తేరుకునేలోపే వెనుక నుంచి మరో వాహనం వచ్చి బలంగా ఢీకొట్టింది. దీంతో రెండింటి మధ్య పెళ్లి బృందం ప్రయణిస్తున్న వాహనం నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న 10 మందిలో వరుడి మేనమామ సత్యనారాయణ(70), పెద్దమ్మ అన్నపూర్ణమ్మ(65) అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలిన వారు వాహనంలోనే చిక్కుకుపోవడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది క్రేన్‌ సాయంతో వారిని బయటకు తీశారు. అనంతరం క్షతగాత్రులను ఒంగోలు కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories