ప్రకాశం జిల్లాలో ఘోరం.. కరెంట్ షాక్ తో 9 మంది మృతి

ప్రకాశం జిల్లాలో ఘోరం.. కరెంట్ షాక్ తో 9 మంది మృతి
x
Representational Image
Highlights

ప్రకాశం జిల్లాలో ఘోరం జరిగింది. మిర్చి కూలీలతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో పెద్ద ప్రమాదం సంభవించింది.

ప్రకాశం జిల్లాలో ఘోరం జరిగింది. మిర్చి కూలీలతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో పెద్ద ప్రమాదం సంభవించింది. కరెంట్ షాక్ తగలడంతో పలువురు అక్కడికక్కడే మృతిచెందారు. జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలోని మాచవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కరెంటు తీగలు తెగి కూలీలపై పడడంతో షాక్ తగిలి మృతిచెందినట్టుగా సమాచారం.

వీరంతా సమీపంలోని మిరప తోటలో మిరపకాయలు కోసి ఇంటికి తిరిగి వెళుతుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో దాదాపు 30 మంది కూలీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలోనే 9 మంది చనిపోయారు, పలువురు గాయపడడంతో వారిని స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. మరో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చనిపోయిన వారిలో ఏడుగురు మహిళలు ఉన్నట్టు సమాచారం.


పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ గుర్తించిన మృతుల వివరాలు ఇలా ఉన్నాయి..

1.పీకా కొటేశ్వరమ్మ(50),

2.నుకతోటి లక్ష్మే(65),

3.కాకుమాను రమాదేవి(55),

4.కాకుమాను కుమారి(45),

5.కాకుమాను రాణిశ్రీ(40),

6.గోళ్ళ రవి శంకర్(20),

7.కాకుమాను శివ(17)

8.కాకుమాను మౌనిక(18)

9.కాకుమాను అమూల్య18)

Show Full Article
Print Article
Next Story
More Stories