సీఎం పళనిస్వామిని పరామర్శించిన ఆర్కే రోజా

సీఎం పళనిస్వామిని పరామర్శించిన ఆర్కే రోజా
x
Highlights

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామిని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్‌ ఆర్కే రోజా పరామర్శించారు. సీఎం పళనిస్వామి తల్లి తవసాయమ్మ గతవారం..

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామిని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్‌ ఆర్కే రోజా పరామర్శించారు. సీఎం పళనిస్వామి తల్లి తవసాయమ్మ గతవారం అనారోగ్యంతో మరణించారు. దీంతో సీఎంను పరామర్శించారు రోజా.. ఆమెతోపాటు భర్త సెల్వమణి కూడా ఉన్నారు. ముందుగా తవసాయమ్మ చిత్ర పటం వద్ద పుష్పాంజలి ఘటించారు. కొంతసేపు పళనిస్వామితో మాట్లాడి తన సానుభూతి తెలియజేశారు. గ్రీన్‌వేస్‌ రోడ్డులోని పళనిస్వామి ఇంటికి రాజకీయాలకు అతీతంగా నేతలు వచ్చి ఆయన తల్లికి నివాళులు అర్పిస్తున్నారు.

మంగళవారం ఎండీఎంకే అధ్యక్షుడు వైగో, సీపీఐ నేత ముత్తరసన్, సినీ నటి, బీజేపీ రాష్ట్ర నాయకురాలు కుష్బూ, డీఎండీకే నేత సుధీప్‌, సినీ నిర్మాత ఆర్‌బీ చౌదరి పళనిస్వామిని పరామర్శించిన వారిలో ఉన్నారు. కాగా ఏఐఏడీఎంకే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళనిస్వామిని ఎన్నుకున్న సంగతి తెలిసిందే. సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరును డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం బలపరిచారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారం సాధిస్తామని ఏఐఏడీఎంకే నేతలు జోశ్యం చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories