కాకినాడలో రామ్‌గోపాల్‌వర్మ సందడి

RGV Sankranti Celebrations 2023 At Kakinada
x

కాకినాడలో రామ్‌గోపాల్‌వర్మ సందడి

Highlights

*నాగబాబు కామెంట్స్‌పై స్పందించడానికి నిరాకరించిన ఆర్జీవీ

RGV: సంక్రాంతి సందర్భంగా కాకినాడలో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. పందాల కోసం ఇతర ప్రాంతాల నుంచి పందెం రాయుళ్లు తరలివచ్చారు. ఇక సంక్రాంతి వేళ డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ కాకినాడలో సందడి చేశారు. వలసపాకలో కోడిపందాలను ఆయన తిలికించారు. RGVతో పాటు నటుడు కృష్ణ కూడా ఉన్నారు. RGV రాకతో కాకినాడలో సందడి వాతావరణం నెలకొంది. స్థానికులు వర్మతో సెల్ఫీలు తీసుకున్నారు. ఇక నటుడు నాగబాబు వ్యాఖ్యలపై స్పందించడానికి RGV నిరాకరించాడు. నాగబాబు ఏం మాట్లాడారో వినలేదని.. ఆయన ఏ కామెంట్స్ చేశారో చూసి తర్వాత స్పందిస్తానన్నారు. ఫ్రెండ్స్ పిలిస్తే ఇక్కడికి వచ్చానని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories