Review 2019 : టెండర్లు రివర్స్.. సొమ్మూలు రివర్స్..!

Review 2019  :  టెండర్లు రివర్స్.. సొమ్మూలు రివర్స్..!
x
2019 Review
Highlights

రాష్ట్ర అభివృద్ధి పేరుతో గత సర్కార్ అనుకూలమైన సంస్థలకు ఎక్సెస్ రేట్లకు టెండర్లను కట్టబెట్టింది.

రాష్ట్ర అభివృద్ధి పేరుతో గత సర్కార్ అనుకూలమైన సంస్థలకు ఎక్సెస్ రేట్లకు టెండర్లను కట్టబెట్టింది. 2019ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం అవినీతికి రివర్స్ టెండరింగ్ ద్వారా చెక్ పెట్టింది. వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్‌ను ప్రైవేటు సంస్థలకు అధిక రేట్లకు అప్పగించడం ద్వారా.. సదరు సంస్థల నుంచి పెద్ద ఎత్తున కమీషన్లు దండుకున్న ప్రైవేటు వ్యక్తులకు అడ్డుకట్ట పడింది. అధికారంలోకి వచ్చిన 6నెలల కాలంలోనే ప్రభుత్వం తీసుకున్న రివర్స్ టెండరింగ్ తో వందల కోట్లు ఆదా అయింది.

సాగునీటి ప్రాజెక్ట్‌ల నుంచి పక్కాగృహాల వరకు ఇష్టారాజ్యంగా కాంట్రాక్టు ఎక్కువ కోట్ చేసిన సంస్థలకు పనులను అప్పగించడం గత ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో అర్జించిందనే ఆరోపణలు వున్నాయి. నిజానికి నిర్మాణ పనుల వ్యయం కంటే 10 నుంచి 25 శాతం వరకు అధికంగా కోట్ చేసిన సంస్థలకు అప్పటి ప్రభుత్వం కాంట్రాక్ట్ లను ఖరారు చేసింది. దీని వలన తక్కువ వ్యయంతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టులు కోట్లాది రూపాయల ప్రజాధనం అధికంగా కెటాయించడం జరిగింది. వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో అక్రమాలపై దృష్టి సారించింది. ప్రజాధనంను కొల్లగొడుతున్న సంస్థలు, చెక్ పెట్టేందుకు రివర్స్ టెండరింగ్ విధానంను ముందుకు తీసుకొచ్చింది.

రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి పనులను ప్రభుత్వం టెండర్ల ద్వారా నిర్వహిస్తుంది. పలు రకాల టెండర్లు ఉంటాయి. ఓపెన్ టెండర్లు, బిడ్డింగ్‌లు, ఈ టెండర్లు, ఈ ప్రోక్యూర్ మెంట్, నామినేటెడ్ పనులు అప్పగిస్తూ వుంటారు. అయితే పారదర్శకంగా నిర్వహించడం ద్వారా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై వుంటుంది. టెండర్ దక్కించుకున్న సంస్థలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం విఫలమైనా, అలక్ష్యంగా వ్యవహరించినా ఆ సంస్థలకు ఇచ్చిన పనులను రద్దు చేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. కాంట్రాక్ట్ పనుల్లో అవినీతిని అరికట్టడానికి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ఎంచుకుంది.

రివర్స్ టెండరింగ్ పోలవరంలో రూ.782.80 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజల పోలవరం ప్రాజెక్ట్ పనుల్లోనూ గత ప్రభుత్వం అవకతవకలకు పాల్పడింది. ప్రాజెక్ట్ టెండర్ల వ్యవహారంలో ప్రజాధనంను ఇష్టారాజ్యంగా గత ప్రభుత్వం ఖర్చు పెట్టేందుకు ప్రయత్నించింది. అధికారంలోని వచ్చిన వెంటనే వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్ట్ పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయడంతో పాటు, కాంట్రాక్ట్ సంస్థలకు కట్టబెట్టిన ఎక్సెస్ పనులను పరిశీలించారు. అందుకోసం ప్రత్యేకంగా నిపుణులతో కమిటీని ఏర్పాటు చేశారు.

పోలవరం ప్రాజెక్టు ఎడ‌మ కాలువ‌కు అనుసంధానం చేసే 65వ ప్యాకేజీ ప‌నుల‌కు రివ‌ర్స్ టెండ‌రింగ్ పద్దతిని వర్తింపచేశారు. దాని ద్వారా రూ. 58 కోట్ల ప్రజాధనం ఆదా అయ్యింది. ఈ రివర్స్ టెండరింగ్ లో మొత్తం 6 సంస్థలు టెండ‌ర్లు దాఖ‌లు చేయ‌గా, అందులో ఎల్ 1 సంస్థ రూ.260.26 కోట్లకు టెండ‌ర్ దాఖ‌లు చేసింది. రూ.274 కోట్ల విలువ చేసే ప‌నుల‌ను 6.1 శాతం త‌క్కువ‌కు పూర్తి చేయ‌డానికి అంగీక‌రించిన ఎల్ 1 క‌న్నా ఎవ‌రైనా త‌క్కువ‌కు చేస్తారా అంటూ ప్రభుత్వం రివ‌ర్స్ టెండ‌రింగ్ నిర్వహించింది. దీంతో రూ.231.47 కోట్లతో ఈ పనులు పూర్తి చేసేందుకు మ్యాక్స్ ఇన్‌ఫ్రా సంస్థ ముందుకొచ్చింది. ఇది అంచ‌నా విలువ క‌న్నా 15.66 శాతం త‌క్కువ కావడం గమనార్హం. ఈ ఒక్క టెండర్ లోనే గ‌తంలో నిర్వహించిన టెండ‌ర్‌తో పోలిస్తే రూ.58.53 కోట్ల ప్రజాధ‌నం ఆదా అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

హెడ్ వ‌ర్క్స్, ప‌వ‌ర్ స్టేష‌న్ టెండర్ల ద్వారా భారీగా ప్రజాధనం ఆదా చేసింది. ప‌వ‌ర్ స్టేష‌న్ ,పోలవరం హెడ్ వ‌ర్క్స్, టెండ‌ర్లు పిలిచారు. రూ. 4,987.55 కోట్ల విలువచేసే ప‌నుల‌కు టెండర్లుకు 12.6 శాతం పనులు చేపట్టేందుకు 'మేఘా' సంస్థ ముందుకు వచ్చింది. ఈ పనుల కోసం మేఘా సంస్థ రూ. 4,358.11 కోట్లు కోట్‌ చేస్తూ బిడ్డింగ్‌ వేసింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ. 628.43 కోట్లు ఆదా అవుతుందని ప్రాజెక్ట్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

పేదలకు అందించే పక్కాగృహాల నిర్మాణంలోనూ ఈ విధానంపై వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తిస్థాయి దృష్టి సారించింది. దీనితో ఏకంగా రూ. 303.31 కోట్ల రూపాయల ఆదా జరిగింది. గృహనిర్మాణంకు సంబంధించి తొలిదశలో 14,368 ఇళ్ల నిర్మాణంకు రూ. 105.91 కోట్లు, రెండో దశ లో 6,596 ఇళ్ళ నిర్మాణం రూ. 46.03 కోట్లు, మూడోదశలో 19,296 ఇళ్లకు నిర్వహించిన రివర్స్ టెండరింగ్ లో 103.89 కోట్ల ఆదా అయ్యాయి.

సోమశిల రెండోదశ కెనాల్ రివర్స్ టెండరింగ్ ద్వారా 67.9 కోట్ల ఆదా అయ్యింది. బీవిఎస్సార్ కన్ స్ట్రక్షన్‌ ఈ టెండరింగ్ లో 8.69 శాతం తక్కువకు ఈ పనులను దక్కించుకుంది. గాలేరు-నగరి రెండో దశ రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.35.3 కోట్ల మేర ఆదా అయ్యింది. మొత్తం రూ.391.13 కోట్ల వ్యయంతో ఈ పనులకు టెండర్లు నిర్వహించారు. దీనిలో 5.04 శాతం తక్కువతో రూ.371.43 కోట్లకే కాంట్రాక్ట్ సంస్థ పనులను దక్కించుకుంది.

గ్రామ సచివాలయాల ,గ్రామ, వార్డు వాలంటీర్లకు సెల్ ఫోన్ సదుపాయం కోసం ప్రభుత్వం సెల్ ఫోన్లు, సిమ్ కార్డులకు టెండర్లు నిర్వహించింది. అయితే ఇందులో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను అనుసరించింది. మొత్తం 2.64 లక్షల ఫోన్లకు నిర్వహించిన టెండర్ల నిర్వహించింది. ఒక సంస్థ రూ. 317.61 కోట్లకు బిడ్ దాఖలు చేసింది. ఇక మరోసంస్థ రూ.233.81 కోట్లుకు బిడ్ దాఖలు చేసింది. దీంతో 26.4శాతం తక్కువకే టెండర్ ఖరారు అయ్యింది. దీనివల్ల దాదాపు రూ.83.80 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యింది. అలాగే 4-జి సిమ్‌ల కొనుగోళ్లలో 33 కోట్ల 76 లక్షలు ఆదా అయినట్టు ప్రభుత్వం ప్రకటించింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories