పాఠకులకు అవసరమైన సేవలు అందించే బాధ్యత గ్రంధాలయ అధికారులదే

పాఠకులకు అవసరమైన సేవలు అందించే బాధ్యత గ్రంధాలయ అధికారులదే
x
Highlights

జిల్లాలో గ్రంధాలయాల ద్వారా పాఠకులకు అవసరమైన సేవలు అందించేలా గ్రంధాలయ అధికారులు బాధ్యతగా పని చేయాలని సంయుక్త కలెక్టర్, జిల్లా గ్రంధాలయ సంస్థ పర్సన్ ఇన్ చార్జ్ శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.

గుంటూరు: జిల్లాలో గ్రంధాలయాల ద్వారా పాఠకులకు అవసరమైన సేవలు అందించేలా గ్రంధాలయ అధికారులు బాధ్యతగా పని చేయాలని సంయుక్త కలెక్టర్, జిల్లా గ్రంధాలయ సంస్థ పర్సన్ ఇన్ చార్జ్ శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. కలక్టరేట్ లోని తన ఛాంబర్లో జిల్లా గ్రంధాలయ సంస్థ 2019-20 సంవత్సరం సవరించిన బడ్జెట్ అంచనాలు, 2020-21 ఆర్దిక సంవత్సరం బడ్జెట్ అంచనాలపై చర్చించేందుకు శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన జిల్లా గ్రంధాలయ సంస్థ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వ సభ్య సమావేశం అజెండాలోని అంశాలపై సభ్యులతో చర్చించి, సూచనలు చేస్తూ శ్రీధర్ రెడ్డి ఆమోదం తెలి పారు. 2019-20 సంవత్సరం సవరించిన బడ్జెట్ అంచనాలు, 2020-21 ఆర్దిక సంవత్సరం బడ్జెట్ అంచనాలను ఆమోదిస్తూ క్యాష్ రశీదు పుస్తకాలను తనిఖి సమయంలో పరిశీలన కోసం అందించాలని సూచించారు.

జిల్లాలోని వివిధ గ్రంధాలయాలలో పోగొట్టిన పుస్తకాల ఖరీదును వెంటనే గ్రంధాలయ నిర్వహకుల నుండి వసూలు చేయాలని, 500 రూపాయల పైన విలువ కలిగిన పుస్తకాలను పోగొట్టిన గ్రంధాలయ నిర్వహకుల నుండి సంజాయిషీ కోరాలన్నారు. గ్రంధాలయాలలో చినిగిపోయి శిధిలావస్థకు చేరి చదవడానికి వీలు లేని పుస్తకాలను తొలగించడానికి గత 11 సంవత్సరాలుగా ప్రతిపాదనలు అందించడంలో నిర్లక్ష్యం వహించిన జిల్లా గ్రంధాలయ సంస్థ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసారు. అదే విధంగా జిల్లాలోని వివిధ గ్రంధాలయాలలో దాతలు సమకూర్చిన పుస్తకాలు, ఫర్నిచర్, వస్తువులు స్వీకరిం చేందుకు ఆమోదం తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories