ఏపీ సచివాలయంలో గణతంత్ర వేడుకలు

ఏపీ సచివాలయంలో గణతంత్ర వేడుకలు
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ...

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, చీఫ్‌ సెక్యూరిటీ అధికారి కేకే మూర్తి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. అసెంబ్లీ కార్యాలయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, మండలి కార్యాలయంలో చైర్మన్ షరీఫ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఉద్యోగులు పాల్గొన్నారు.

అలాగే తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లం జాతీయ జెండాను అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం ముఖ్య కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, సీఎం కార్యాలయ కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌, సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్‌ రెడ్డి, సీఎస్‌వోలు జోషి, పరమేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories