కియా పరిశ్రమ తరలింపుపై స్పందించిన ఆ సంస్థ ప్రతినిధులు

కియా పరిశ్రమ తరలింపుపై స్పందించిన ఆ సంస్థ ప్రతినిధులు
x
కియా ఫైల్ ఫోటో
Highlights

సౌత్ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటార్స్‌ ఆంధ్రప్రదేశ్‌ నుంచి తమిళనాడుకు తరలిపోతుందంటూ వస్తున్న వార్తలను ఆ సంస్థ ఖండిస్తున్నట్లు తెలుస్తోంది.

సౌత్ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటార్స్‌ ఆంధ్రప్రదేశ్‌ నుంచి తమిళనాడుకు తరలిపోతుందంటూ వస్తున్న వార్తలను ఆ సంస్థ ఖండిస్తున్నట్లు తెలుస్తోంది. కియా మోటార్స్‌- ప్రభుత్వం కలిసే పని చేస్తున్నాయని ఏపీ పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ తెలిపారు. అలాగే దీనిపై కియా మోటార్స్‌ సంస్థ ప్రతినిధి మనోహర్ భగత్ స్పందించినట్లు తెలుస్తోంది. దేశంలో తమ కంపెనీని విస్తరించాలనే చూస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ నుంచి తమ ప్లాంట్‌ను తరలించాలనే ఆలోచన తనకు లేదని స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

అలాగే దీనిపై తమిళనాడు ప్రభుత్వం స్పందించినట్లు తెలుస్తోంది. కియా మోటార్స్‌ యాజమాన్యంతో సంప్రదించలేదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో మంచి సంబంధాలు కోరుకుంటున్నామని పేర్కొంది. తమిళనాడు పరిశ్రమల ప్రధాన కార్యదర్శి ఏపీ పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవకు ఫోన్ ద్వారా తెలిపినట్లు తెలుస్తోంది. రాయిటర్స్‌ ప్రచురితమైన కథనం వచ్చిన కథనాన్ని పూర్తిగా ఖండిస్తున్నట్లు కియా మోటర్స్‌ తెలిపింది.

గత డిసెంబర్‌లో కియా మోటార్స్‌ పూర్తిస్థాయిలో కార్ల తయారీ ప్లాంటు ఉత్పత్తి ప్రారంభించిన సందర్భంగా.. ముఖ్య అతిథిగా కంపెనీ నిర్వహించిన కార్యక్రమానికి సీఎం జగన్‌ హాజరయిన విషయం తెలిసిందే. కియా మోటర్స్‌కు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

‎కియామోటర్స్‌ తరలిపోతుదంటూ జరుగుతున్ననుంచి తప్పుడు ప్రచారాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా ఖండించారు. కియా సంస్థ విషయంలో టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఏపీ మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. కియా సంస్థకు ప్రభుత్వం తరపున పూర్తి సహాకారం ఉంటుందన్నారు. కియా సంస్థ ఎక్కడికి తరలిపోదని కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారని, తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని బుగ్గన చెప్పారు. పరిశ్రమల శాఖ నుంచి కియా సంస్థకు పూర్తి సహాకారం ఉంటుందని తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories