ఏపీలో మరో రెండు చోట్ల రీపోలింగ్‌!

ఏపీలో మరో రెండు చోట్ల రీపోలింగ్‌!
x
Highlights

ఏపీలో మరో రెండు చోట్ల రీపోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ జరగనుంది. అయితే...

ఏపీలో మరో రెండు చోట్ల రీపోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ జరగనుంది. అయితే మరో రెండు పోలింగ్ స్టేషన్లపై కూడా దృష్టిసారించినట్టు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో మరో రెండు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఈసీకి కలెక్టర్ సిఫార్సు చేశారు. 310, 323 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఆయన తెలిపారు.మరోవైపు ఏపీలో ఏడు నియోజకవర్గాల పరిధిలో 19 చోట్ల రీపోలింగ్‌ నిర్వహించాలని గతంలోనే ఈసీని కోరామని అయితే తమ ఫిర్యాదులను బుట్టదాఖలు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కౌంటింగ్‌కు ఇంకా సమయం ఉన్నందున తమ విజ్ఞప్తిని పరిశీలించాలని వారు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories