పశ్చిమగోదావరి జిల్లా పేరుపాలెం బీచ్‌లో ఆక్రమణల తొలగింపు

* వైసీపీ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యేపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు

R Tripura Malini
Published on: 11 Dec 2022 11:17 AM IST
Removal Of Encroachments At Memapalem Beach In West Godavari District
X

పశ్చిమగోదావరి జిల్లా పేరుపాలెం బీచ్‌లో ఆక్రమణల తొలగింపు

West Godavari: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో ఆక్రమణ తొలగింపులో నష్టపోయిన బాధితులను నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై, స్థానిక ఎమ్మెల్యే ప్రసాదరాజులపై మండిపడ్డారు. బీచ్‌లో 30 ఏళ్లుగా చిన్న చిన్న వ్యాపారులు చేసుకొని జీవనం సాగిస్తున్న వారిపై పోలీసుల అండతో ఆక్రమణలు తొలగించడం దారుణమన్నారు.

కనీసం నోటీసులు ఇవ్వకుండా ఆక్రమణలను పడగొట్టించడం సరికాదని, ప్రజలపై ఎందుకు మీకంత కక్ష అని మాధవ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు అండగా ఉండి న్యాయం చెయాల్సిన ఎమ్మెల్యే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడమేంటని మండిపడ్డారు. ప్రజలకు అనాయ్యం జరిగితే కొద్ది రోజుల్లోనే వాళ్లే నీకు బుద్ది చెబుతారని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు హెచ్చరించారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story