తిరుపతి లడ్డు అమ్మకాలకు విశేష స్పందన

తిరుపతి లడ్డు అమ్మకాలకు విశేష స్పందన
x
Highlights

రెండు నెలల పదిహేను రోజులు .... ఆలయంలో దర్శనాలు నిలిపివేసి. గుడి ప్రారంభమయ్యాక ఇన్ని రోజులు నిలిపివేసిన సందర్భాలు లేవు.

రెండు నెలల పదిహేను రోజులు .... ఆలయంలో దర్శనాలు నిలిపివేసి. గుడి ప్రారంభమయ్యాక ఇన్ని రోజులు నిలిపివేసిన సందర్భాలు లేవు. ఈ రెండు నెలల కాలంలో ఒకసారి చూస్తే కోట్ల మంది భక్తులు స్వామిని దర్శించుకునేవారు. కరోనా నేపథ్యంలో దర్శనలు నిలిపి వేయక తప్పలేదు. దేవుని దర్శన భాగ్యాన్ని తప్పని సరి పరిస్థితుల్లో నిలిపివేసిన టీటీడీ బోర్డు, కనీసం ఆయన ప్రసాదాన్నయినా భక్తులకు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

మార్చి 19 నుంచి కొనసాగుతున్న లాక్డౌన్ మరోమారు పొడిగించేందుకు కేంధ్రం సన్నద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతల మే 31 వరకు లాక్ డౌన్ పొడిగించిన విషయం విదితమే. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల విక్రయాలకు విశేష స్పందన లభిస్తోంది. మూడు రోజుల్లో 8 లక్షల లడ్డూలను టీటీడీ విక్రయించింది. అనంతపురం, కడప జిల్లాల్లో లడ్డూ విక్రయాల సంఖ్య లక్ష దాటిపోయింది. విశాఖ, కృష్ణా, కర్నూలు జిల్లాల నుంచి భారీగా లడ్డూ ప్రసాద కొనుగోళ్లు జరిగాయి.

కాగా.. లాక్‌డౌన్ కారణంగా రెండు నెలల నుంచి తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయడంతో… భక్తులకు ఎంతో ఇష్టమైన శ్రీవారి లడ్డూలను అందజేయాలని టీటీడీ భావించింది. ఇందుకోసం పెద్ద ఎత్తున లడ్డూలను తయారు చేయించి వివిధ జిల్లాలకు పంపించింది. కౌంటర్ ప్రారంభించిన గంటల్లోనే లడ్డూ విక్రయాలు పూర్తవుతున్నాయి. జిల్లా కేంద్రాలతో పాటు టీటీడీ కళ్యాణమండపాల వద్ద లడ్డూల విక్రయం జరుగనుంది. లడ్డూ ప్రసాదం విక్రయాలకు భక్తుల నుంచి విశేష స్పందన వస్తోంది.


హెచ్ఎంటీవీ లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories