కృష్ణా జిల్లా నూజివీడు సబ్ జైలులో రిమాండ్ ఖైదీ మృతి.. పోలీసు చర్యలతోనే...

Remand Prisoner Expired due to Health Issue in Nuzvidu Sub Jail Krishna District | AP Live News
x

కృష్ణా జిల్లా నూజివీడు సబ్ జైలులో రిమాండ్ ఖైదీ మృతి.. పోలీసు చర్యలతోనే...

Highlights

Krishna - Nuzvidu: ఇటీవల అక్రమ మద్యం తరలింపు కేసులో అరెస్ట్ అయిన భానుచందర్...

Krishna - Nuzvidu: కృష్ణా జిల్లా నూజివీడు సబ్ జైలులో రిమాండ్ ఖైది మృతి చెందాడు. విజయవాడ భవానీపురంలో నివసిస్తున్న మామిడి భానుచందర్ ఇటీవల అక్రమ మద్యం సీసాలతో పోలీసులకు పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.

తీవ్ర కడుపునొప్పి, వాంతులు కావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా భానుచందర్ మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. భానుచందర్ మృతి పట్ల కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులే ఏదో చేసి ఉంటారని మృతుడి భార్య ఆరోపిస్తుంది. . తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories