అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త

అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త
x
Highlights

నిన్న అమరావతి వేదికగా జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యంగా.. అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవాలని...

నిన్న అమరావతి వేదికగా జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యంగా.. అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. చిన్నమొత్తాల వారికి ముందుగా చెల్లించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇందుకోసం ముందుగా 250 కోట్లు ప్రభుత్వమే చెల్లించనున్నారు. ఈ మేరకు ఈ విషయాన్నీ కోర్టుకు తెలియజేయాలని సమావేశంలో నిర్ణయించారు. జిల్లాల్లో కమిటీల ద్వారా చెల్లింపులు జరపాలని కోర్టును ప్రభుత్వం కోరనుంది. ఇందుకోసం కోర్టులో మెమో వేసి, న్యాయస్థానం ఆదేశాల ప్రకారం వెళ్లాలని యోచిస్తున్నట్టు సమాచారం.

అలాగే ఇటీవల ప్రకటించిన 10 శాతం ఈబీసీ రిజర్వేషన్లపై చర్చించిన క్యాబినెట్.. ఆ రిజర్వేషన్లలో కాపులకు 5శాతం, మిగిలిన అగ్రవర్ణాలకు 5శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో వృద్ధులు, వితంతువుల పింఛన్లను వెయ్యి నుంచి 2 వేల రూపాయలకు పెంచుతూ క్యాబినెట్ లో అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు. ఇక సినీనటుడు శివాజీ ఇటీవల లేవనెత్తిన చుక్కల భూములపై కూడా చర్చ జరిగింది. ట్రాక్టర్లు, ఆటో రిక్షాలకు జీవితకాలం పన్ను మినహాయింపును మంత్రివర్గం ఆమోదించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories