Top
logo

శ్రీశైలానికి వరద ప్రవాహం తగ్గింది

శ్రీశైలానికి వరద ప్రవాహం తగ్గింది
Highlights

శ్రీశైలానికి వరద ప్రవాహం తగ్గింది శ్రీశైలానికి వరద ప్రవాహం తగ్గింది

ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణానదికి వరద ప్రవాహం తగ్గింది. దీంతో శ్రీశైలం జలాశయానికి ఎగువనుంచి ఇన్ ఫ్లో తగ్గింది. అయితే గత పదిరోజులుగా రాయలసీమలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. సుంకేసుల, హంద్రీనీవా నుంచి శ్రీశైలం జలాశయానికి 1,44,650 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో శనివారం నాలుగు గేట్లను 10 అడుగుల మేర తెరిచి స్పిల్‌వే ద్వారా 1,11,748 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

రెండు జలవిద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పాదన అనంతరం 68,671 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు నాగార్జున సాగర్‌ నుంచి కుడి, ఎడమ కాలువలకు 14 వేలు.. 10 గేట్లను ఎత్తి 1,49,140 క్యూసెక్కులు దిగువకు, విద్యుదుత్పత్తి ద్వారా 32,886, ఎస్‌ఎల్‌బీసీకి 2,400 నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి 2.52 లక్షల క్యూసెక్కుల నీరు చేరింది. ఇటు పులిచింతలలో 8 గేట్లు ఎత్తి 2.80 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

Next Story