కల్యాణి డ్యాం వద్ద ఎర్రచందనం దుంగలు స్వాధీనం

కల్యాణి డ్యాం వద్ద రవాణా కు సిద్దంగా ఉన్న 36 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
కల్యాణి డ్యాం వద్ద రవాణా కు సిద్దంగా ఉన్న 36 ఎర్రచందనం దుంగలు స్వాధీనం వాహనం సీజ్ చేసి ఒక స్మగ్లర్ ను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్
భాకరాపేట మార్గం లో కల్యాణి డ్యాం సమీపంలో వాహనం లోకి ఎక్కించి అక్రమ రవాణా కు సిద్ధంగా ఉన్న 36 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ స్వాధీనం చేసుకుంది. ఒక స్మగ్లర్ ను అరెస్ట్ చేయడంతో పాటు ఒక గూడ్స్ క్యారియర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఆంజనేయులు ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటయ్య ఆధ్వర్యంలో ఆర్ ఎస్ ఐ లింగాధర్, ఎఫ్ బి ఓ లు జానీ బాషా, కోదండం బృందం గురువారం మధ్యాహ్నం నుంచి భాకరాపేట అడవుల్లో కూంబింగ్ చేపట్టారు. అక్కడ నుంచి కల్యాణి డ్యాం మీదుగా వస్తుండగా, తెల్లమరం అనే ప్రాంతంలో రాత్రి 2.00 గంటల సమయంలో స్మగ్లర్లు అలికిడి వినిపించింది.
దీంతో అప్రమత్తమైన టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారిని చుట్టు ముట్టే ప్రయత్నం చేశారు. పోలీసులను చూసిన దాదాపు 40 మంది స్మగ్లర్లు దుంగలు పడేసి చీకటి లో పారి పోయారు. అయితే ఒక స్మగ్లర్ ను పట్టుకో గలిగారు. సమీపంలో లోడింగ్ కు సిద్దంగా ఉన్న వాహనం కనిపించింది. వాహనం లో ఎరువులకు సంభందించిన బస్తాలు ఉన్నాయి.
ఎర్రచందనం దుంగలను వాహనం లో ఎక్కించి, వాటి పైన మూటలు వేసి రవాణా చేయనున్నట్లు పట్టు బడిన స్మగ్లర్ తెలిపాడు. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ వెంకటయ్య మాట్లాడుతూ స్మగ్లర్ ను తమిళనాడు తిరువన్నామలై జిల్లా, చెంగం తాలూకా, పాంబత్తూరుకు చెందిన కుమార్ (25)గా గుర్తించినట్లు తెలిపారు. మిగిలిన స్మగ్లర్లు కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు తెలిపారు. సంఘటన స్థలానికి ఎఫ్ ఆర్ ఓ ప్రసాద్ చేరుకోగా, సిఐ సుబ్రహ్మణ్యం పరిస్థితి సమీక్షించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMTపక్షుల కోసం ఆరంతస్తుల భవనం.. 2వేల పక్షులు నివసించే అవకాశం
27 Jun 2022 11:27 AM GMTBhimavaram: భీమవరంలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు
27 Jun 2022 11:04 AM GMT
సుబ్బారావు బెయిల్ పిటిషన్‌పై నేడు కోర్టులో విచారణ
28 Jun 2022 3:04 AM GMTశివసేన నేత సంజయ్ రౌత్‌కు ఈడీ నోటీసులు
28 Jun 2022 2:26 AM GMTకరీంనగర్ జిల్లాలో అందని పాఠ్య పుస్తకాలు
28 Jun 2022 1:45 AM GMTVisakhapatnam: విశాఖలో కరోనా వైరస్ ఉధృతి
28 Jun 2022 1:16 AM GMTఇవాళ తెలంగాణ సీజేగా ఉజ్జల్ భూయాన్ ప్రమాణం
28 Jun 2022 1:02 AM GMT