శేషాచలం అడవుల్లోకి ప్రవేశిస్తున్న 10 మంది స్మగ్లర్లు అరెస్ట్

శేషాచలం అడవుల్లోకి ప్రవేశిస్తున్న 10 మంది స్మగ్లర్లు అరెస్ట్
x
Highlights

* ఎర్రచందనం కోసం వచ్చినట్లు వెల్లదించిన నిందితులు * నిత్యావసర సరుకులు, గొడ్డళ్లు, రంపాలు స్వాధీనం

ఎర్రచందనం దుంగలు కోసం శేషాచలం అడవుల్లో కి ప్రవేశిస్తున్న పది మంది స్మగ్లర్లు ను ఆదివారం రాత్రి టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఆదేశాల మేరకు ఆ ఎస్ ఐ లు వాసు, లింగాధర్, సురేష్ లు కూంబింగ్ నిర్వహించుకుని తిరిగి వస్తుండగా, ఎస్వీ జూ పార్క్ రోడ్డులో అరవింద్ ఐ ఆసుపత్రి ఎదురుగా ఉన్న అడవుల్లో కి ప్రవేశించారు. వీరిని గమనించిన టాస్క్ ఫోర్స్ వారిని అడ్డగించి, విచారించగా ఎర్రచందనం దుంగలు కోసం వచ్చినట్లు నిర్థారణ అయ్యింది.

దీంతో వారిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి నిత్యావసర సరుకులు, గొడ్డళ్లు, రంపాలు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్పీ ఆంజనేయులు మాట్లాడుతూ స్మగ్లర్లు తమిళ నాడు లోని ధర్మపురి జిల్లాకు చెందిన వారుగా గుర్తించామన్నారు. స్మగ్లర్లు ను అడవుల్లో కి వెళ్లకుండా నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెండు రోజులు క్రితం కూడా 25 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దీనివలన ఎర్రచందనం చెట్లు నరికివేతకు గురికాకుండా కాపాడగల్గుతున్నామని చెప్పారు. సంఘటన స్థలానికి డీఎస్పీ వెంకటయ్య, ఆర్ ఐ భాస్కర్, సిఐ వెంకట రవి, వీరితో పాటు అలిపిరి సిఐ దేవేంద్ర కుమార్, ఎస్ ఐ వినోద్ కుమార్ చేరుకుని పరిస్థితి సమీక్షించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories