చూడ చక్కని కుటుంబానికి ఏమైంది.. నాలుగేళ్లుగా ఇంట్లోనే ఎందుకుంటున్నారు?

చూడ చక్కని కుటుంబానికి ఏమైంది.. నాలుగేళ్లుగా ఇంట్లోనే ఎందుకుంటున్నారు?
x
వింత ఫ్యామిలీ
Highlights

ఆ కుటుంబానికి ఏమైందో తెలియదు, ఆనందంగా గడుపుతున్న కుటుంబ సభ్యుల జీవన శైలి మారింది. అందరికి దూరంగా ఉంటున్నారు. ఒకటి, రెండు రోజులు కాదు నాలుగేళ్లుగా...

ఆ కుటుంబానికి ఏమైందో తెలియదు, ఆనందంగా గడుపుతున్న కుటుంబ సభ్యుల జీవన శైలి మారింది. అందరికి దూరంగా ఉంటున్నారు. ఒకటి, రెండు రోజులు కాదు నాలుగేళ్లుగా ఇంటికే పరిమితం అయ్యారు. బంధువులతో పాటు ఇరుగుపొరుగు వారితో సైతం మాట్లాడటం మానేశారు. పిల్లలను సైతం స్కూలు కు పంపించకుండా నాలుగు గోడల మద్య మగ్గుతున్నారు. పలకరించిన వారితో వింత సమాధానాలు చెబుతున్నారు. చూడ చక్కని కుటుంబానికి ఏమైంది ఇంట్లోనే ఎందుకుంటున్నారు. ఆ ఫ్యామిలీకి ఏమైంది...?

విజయనరం జిల్లా బొబ్బిలి పట్టణంలో బీసర ఈశ్వర రావు, భార్య ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నారు. అందమైన కుటుంబం అందరితో కలిసి మెలిసి సరదాగ గడిపే వారు. ఏమైందో ఏమో ఇదేళ్లుగా బాహ్య ప్రపంచాన్ని చూడకుండా ఇంట్లోనే ఉంటున్నారు. నాలుగు గోడలకే పరిమితం అయ్యారు. ఈశ్వర్ రావు పిల్లలు కూడా పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే బందీలుగా ఉన్నారు. ఈ దంపతుల ఇద్దరు పిల్లలు రెండేళ్ల కిందటి వరకూ ఓ ప్రయివేటు పాఠశాలలో చదివేవారు. రెండేళ్ల నుంచి వారు కూడా బడికి వెళ్లకుండా రెండేళ్లుగా ఇంట్లో బందీలుగా ఉన్నారు. ఇంటి అవసరాలకు అవసరమైన సామాగ్రి కోసం వారం, పది రోజులకు ఒకసారి జన సంచారం తక్కువ ఉన్న సమయంలో ఈశ్వర్ రావు ఒక్కరు మాత్రమే బయటకు వచ్చి వెంటనే లోపలికి వెళ్లి తాళాలు బిగించుకుంటున్నాడు. బంధువులతోనే కాదు చివరకు ఇరుగుపొరుగు వారితోనూ మాట్లాడడం లేదు.

బొబ్బిలిలో ఈశ్వర రావు కుటుంబం విషయం విస్తృత చర్చకు దారి తీసింది. స్థానికులు అధికారుల దృష్టికి తీసుక వెళ్లారు, స్త్రీ శిషు సంక్షేమ శాఖ పీవో, బొబ్బిలి మున్సిపల్ మాజీ చైర్మన్ అచ్యుతవల్లి వారి నివాసానికి వెళ్లి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. పిల్లలను స్కూలుకు పంపించేందుకు ఒప్పించారు. అయినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పులేదు. ఈశ్వర్ రావు కుటుంబ సభ్యులతో అధికారులు మాట్లాడి సమస్య ఏమిటో తెలుసుకోవాలని, వారి పిల్లలను పాఠశాలకు పంపించేలా చూడాలని స్థానికులు, బంధువులు కోరుతున్నారు.

తాజాగా మీడియా ప్రతినిధులు ఈశ్వర్ రావును కలిసి మాట్లాడితే సీఎం జగన్‌ లేదా విజయమ్మ తమ ఇంటికి రావాలని, తనకు డిప్యూటీ సీఎం పోస్టు ఇవ్వాలని వింత వాదన వినిపిస్తున్నారు. ఈశ్వర్ రావు చేస్తున్న వింత డిమాండ్ విని అందరు ఆశ్చర్యపోతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories