కోస్టల్ గోల్డ్ ఫ్యాక్టరీలో అక్రమ నిర్మాణాలు నిలిపివేయాలని గ్రామస్థులు ధర్నా

కోస్టల్ గోల్డ్ ఫ్యాక్టరీలో అక్రమ నిర్మాణాలు నిలిపివేయాలని గ్రామస్థులు ధర్నా
x
Highlights

మండలంలోని ధర్మవరం వద్ద గల కోస్టల్ గోల్డ్ ఆక్వా ఫ్యాక్టరీ చేస్తున్న అక్రమ నిర్మాణాలను నిలుపుదల చేయాలంటూ మాజీ సర్పంచ్ వెదుళ్ళ బంగారయ్య ఆధ్వర్యంలో గ్రామస్థులు శనివారం నిరసనకు దిగారు.

ఎస్.రాయవరం: మండలంలోని ధర్మవరం వద్ద గల కోస్టల్ గోల్డ్ ఆక్వా ఫ్యాక్టరీ చేస్తున్న అక్రమ నిర్మాణాలను నిలుపుదల చేయాలంటూ మాజీ సర్పంచ్ వెదుళ్ళ బంగారయ్య, మాజీ ఉపసర్పంచ్ అచ్యుత్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్థులు శనివారం నిరసనకు దిగారు. ఇప్పటికే ఈ ఫ్యాక్టరీ నుండి వెలువడే వ్యర్ధాలు తీవ్ర దుర్గంధం వెదజల్లుతూ ఉందని తద్వారా గ్రామస్థులు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

అక్రమ నిర్మాణాలు చేయరాదంటూ కంపెనీ డైరెక్టర్ మోహన కృష్ణతో గ్రామస్తులంతా ముక్తకంఠంతో వాగ్వాదానికి దిగారు. పారిశుధ్యం పట్టించుకోకపోవడం వల్ల అంటు వ్యాధులు ప్రబలతున్నాయని తక్షణమే పారిశుద్ధ్య పనులు చేపట్టి దుర్గంధాన్ని అరికట్టాలని మాజీ సర్పంచ్ బంగారయ్య తెలిపారు.

ఇక్కడ ఎటువంటి అదనపు కట్టడాలు చేపట్టరాదంటూ 2018 ఆగస్టులో పంచాయతీ తీర్మానం చేయడం జరిగిందని, ఆ తీర్మానానికి కంపెనీ యాజమాన్యం అంగీకరించడం జరిగిందని మాజీ ఉపసర్పంచ్ సియ్యాదుల అచ్యుత్ కుమార్ తెలిపారు. కానీ అందుకు విరుద్ధంగా కంపెనీ నిర్మాణాలు చేస్తుందన్నారు. వెంటనే నిర్మాణాలు నిలుపుదల చేయకపోతే కలెక్టరేట్ వద్ద గ్రామస్ఠులంతా ధర్నా చేపడతామని హెచ్చరించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories