7న రాయలసీమ వ్యాప్త విద్యాసంస్థల బంద్‌

7న రాయలసీమ వ్యాప్త విద్యాసంస్థల బంద్‌
x
Highlights

గతకొన్నేళ్లుగా రాయలసీమకు అన్యాయం జరుగుతోందని.. వివక్షకు గురవుతోందని నిరసిస్తూ ఈనెల 7వ తేదీన రాయలసీమ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌ నిర్వహిస్తున్నట్లు...

గతకొన్నేళ్లుగా రాయలసీమకు అన్యాయం జరుగుతోందని.. వివక్షకు గురవుతోందని నిరసిస్తూ ఈనెల 7వ తేదీన రాయలసీమ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌ నిర్వహిస్తున్నట్లు రాయలసీమ విద్యార్థి యువజన జేఏసీ నాయకులు తెలిపారు. ఈ మేరకు సోమవారం వారు మాట్లాడారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రభుత్వ సంస్థలు హైదరాబాదులో పెట్టి అభివృద్ధిని అంతా హైదరాబాదులోనే కేంద్రీకరించారని.. ప్రస్తుతం అమరావతి పేరుతో మళ్ళీ పాలకులు అదే తప్పు చేశారని అన్నారు. శ్రీబాగ్‌ ఒడంబడిక ప్రకారంగా రాయలసీమలో రాజధాని లేదంటే హైకోర్టును ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. 2014లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేశారన్నారు.

ఇప్పుడున్న ప్రభుత్వం అయినా రాయలసీమ గురించి ఆలోచించాలని వేడుకొంటున్నారు. ఒక్క రాయలసీమయే కాదు అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనీ కోరుతున్నారు. సీఎం జగన్‌ ప్రభుత్వం తక్షణమే శ్రీబాగ్‌ ఒప్పందం మేరకు రాయలసీమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఒకవైపు సీమకు అన్యాయం జరుగుతుంటే.. చీమలు, దోమలు, ఇసుక సమస్య అంటూ గురించి గొంతు చించుకుని అరవడంతో అర్ధం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దశాబ్దాలుగా రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై వారు ఈనెల 7న సీమ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories