వైసీపీ పాటకు కోటి..

వైసీపీ పాటకు కోటి..
x
Highlights

సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలుపును, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం కావాలని కాంక్షిస్తూ ఆ పార్టీ రూపొందించిన 'రావాలి జగన్‌.. కావాలి జగన్‌' ప్రచార...

సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలుపును, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం కావాలని కాంక్షిస్తూ ఆ పార్టీ రూపొందించిన 'రావాలి జగన్‌.. కావాలి జగన్‌' ప్రచార గీతం రికార్డులు సృష్టిస్తోంది.ప్రస్తుతం ఈ వీడియోను ఒక్క యూట్యూబ్ లోనే కోటిమందికి పైగా వీక్షించారు. గత కొన్ని రోజులుగా ఈ పాట సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. శనివారం సాయంత్రానికి యూట్యూబ్‌లో ఈ పాటను వీక్షించిన వారి సంఖ్య కోటి దాటేసింది.

ఒక ప్రాంతీయ పార్టీ ప్రచారగీతం ఈ స్థాయిలో జనాదరణ పొందడం ఆల్‌టైం రికార్డ్ గా ఆ పార్టీ నేతలు అభివర్ణిస్తున్నారు. గత నెల వైసీపీ ఆఫీసు నుంచి విడుదల అయిన ఈ పాటను ప్రముఖ సినీ రచయిత సుద్దాల అశోక్‌తేజ రచించారు. ఫిదా చిత్ర సంగీత దర్శకుడు శక్తికాంత్‌ కార్తీక్‌ సంగీతం సమకూర్చగా.. గాయకుడు మనో ఆలపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories