Cumbum: పాఠశాల విద్యార్థులకు రేషన్ సరుకులు పంపిణీ

Cumbum: పాఠశాల విద్యార్థులకు రేషన్ సరుకులు పంపిణీ
x
Highlights

మండలంలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు శనివారం డ్రై రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.

కంభం: మండలంలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు శనివారం డ్రై రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక ఆదర్శ ప్రాథమిక పాఠశాల, పార్కు వీధిలోని పాఠశాలలో మండల విద్యాశాఖాధికారి చక్కా మాధవకృష్ణారావు రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండలంలోని ఆయా పాఠశాలల పరిధిలోని సిఆర్పీలు, ప్రధానోపాధ్యాయులు, విద్యా సంక్షేమ సహాయకులు, వాలంటీర్లు సంయుక్తంగా

ఇంటింటికీ తిరిగి డ్రై రేషన్, చిక్కీలు గుడ్లు పంపిణీ చేశారు. కరోనా వ్యాధి పై అవగాహన కలిగిస్తూ సామాజిక దూరం పాటిస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.. కరోనా ప్రభావం నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు మంజూరు చేసిన రోజు నుండి మార్చి 31 వరకు విద్యార్థులకు పౌష్టికాహారం పంపిణీ చేయడం జరిగిందనీ, పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహార

లోపం లేకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. లాక్ డౌన్ ఉన్నంతవరకు అందరూ ఇంటిపట్టునే ఉండాలనీ, తప్పనిసరై బయటికివస్తే ఖచ్చితంగా సామాజిక దూరం పాటించాలని హితవుపలికారు. ఈ కార్యక్రమంలో సిఆర్పీలు, ప్రధానోపాధ్యాయులు, విద్యా సంక్షేమ సహాయకులు, వాలంటీర్లు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories