Tirumala: తిరుమలలో రథసప్తమి వేడుకలు.. సూర్యప్రభ వాహనంపై శ్రీవారు

Ratha Sapthami in Tirumala Temple
x

Tirumala: తిరుమలలో రథసప్తమి వేడుకలు.. సూర్యప్రభ వాహనంపై శ్రీవారు

Highlights

Tirumala: ఉదయం నుంచే ప్రారంభమైన పూజా కార్యక్రమాలు

Tirumala: రథసప్తమి వేడుకలకు తిరుమల సిద్ధమైంది. సూర్యజయంతి వేడుకల సందర్భంగా ఉదయం నుంచే భక్తుల తాకిడి పెరిగింది. రథసప్తమిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయన్నీ దివ్యాంగసుందరంగా అలంకరించారు టీటీడీ సిబ్బంది. దేశవాలి సంప్రదాయ పుష్పాలతో పాటుగా., దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా రకాల కట్ ఫ్లవర్స్., ఆలయంలో చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అలంకార ప్రియుడైన శ్రీనివాసుడి సన్నిధిని అరుదైన పుష్పాలు,పండ్లతో సర్వాంగ సుందరంగగా అలంకరించారు.

రంగు రంగు పుష్పాలతో ఎటు చూసిన పూల తోరణలు, కట్ అవుట్ లు,బొకేలతో చేసిన అలంకరణ ప్రధాన ఆకర్షణగా నిలుస్తొంది. ఓ వైపు పుష్ప అలంకరణ భక్తులను మంత్రముగ్దులను చేస్తుండగా...విద్యుత్ అలంకరణ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆలయ ప్రధాన గోపురంతో పాటు ప్రకారం, ఆలయం లోపల, వెలుపల, విద్యుత్ దీప వెలుగులతో దేదీపమాన్యంగా వెలిగిపోతుంది. ఇక రథసప్తమికి ప్రతీకగా ఆలయం ముందు శ్రీ మలయప్ప స్వామి వారి ఫ్లెక్సీలతో పాటు….సూర్యప్రభ,చిన్న శేష వాహనం,గరుడ వాహనం, హనుమంత వాహనం, చక్ర స్నానం, కల్పవృక్షం వాహనం, సర్వ భూపాల., చంద్రప్రభ వాహనాలపై విహరిస్తున్న స్వామి వారి చిత్రపటాలు ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories