Ratha Saptami: తిరుమల, అరసవల్లిలో అంగరంగ వైభవంగా మొదలైన రథసప్తమి వేడుకలు

Ratha Saptami: తిరుమల, అరసవల్లిలో అంగరంగ వైభవంగా మొదలైన రథసప్తమి వేడుకలు
x
Highlights

Ratha Saptami: తిరుమల, అరసవల్లిలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల, అరసవల్లి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తిరుమలలో సూర్యప్రభ వాహనంపై...

Ratha Saptami: తిరుమల, అరసవల్లిలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల, అరసవల్లి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తిరుమలలో సూర్యప్రభ వాహనంపై తిరుమాడవీధుల్లో మలయప్ప స్వామిని ఊరేగించనున్నారు. వాయువ్య దిశలో సూర్యప్రభ వాహనాన్ని నిలిపి ఉంచారు. సూర్యకిరణాలు తాకిన వెంటనే వాహన సేవలు ప్రారంభం అవుతాయి.

శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయంలో జరుగుతున్న వేడుకల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేలు, రమణమూర్తి, గోవిందరావు, గౌతు శిరీష పాల్గొన్నారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4వరకు స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు కల్పించనున్నారు. ఆదిత్యుడి దర్శనం కోసం సోమవారం రాత్రి నుంచే ఆలయానికి భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులు కిటకిటలాడుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories