ఏపీ, కర్నాటకలో రాష్ట్రపతి పర్యటన

X
Ram Nath Kovind (file image)
Highlights
* నేటి నుంచి ఫిబ్రవరి 7వరకు టూర్ * ఇవాళ కర్నాటకకు రామ్‌నాథ్ కోవింద్ * రేపు బెంగళూరులో ఎయిర్‌షోకి హాజరు
Sandeep Eggoju4 Feb 2021 3:48 AM GMT
ఇవాళ్టి నుంచి 7వ తారీఖు వరకు ఏపీ, కర్నాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ఇవాళ సాయంత్రం కర్నాటకకు చేరుకోనున్న కోవింద్ రేపు బెంగళూరులోని యెలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో జరుగుతున్న ఏరో ఇండియా-2021 ఎయిర్‌షోను సందర్శించనున్నారు. ఫిబ్రవరి 6న మడికేరి, కోడగు జిల్లాల్లో పర్యటించనున్న కోవింద్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఫిబ్రవరి 7న ఆంధ్రప్రదేశ్‌కు పయనమవుతారు. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చేరుకొని, సత్సంగ్ ఫౌండేషన్ ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. అనంతరం యోగశాల, భారత్ యోగ విద్యాకేంద్రాన్ని రాష్ట్రపతి కోవింద్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు కోవింద్.
Web TitleRam Nath Kovind Tour in Andhra Pradesh and Karnataka
Next Story