అల్లు అర్జున్‌పై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆసక్తికర ట్వీట్

అల్లు అర్జున్‌పై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆసక్తికర ట్వీట్
x
Ram Mohan Naidu
Highlights

'అల.. వైకుంఠపురములో.. సినిమాపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆసక్తికర ట్విట్ చేశారు.

అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన రిలీజ్ నుంచే మంచి బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది. ఇక ఓవర్‌సీస్‌లో కూడా ఈ చిత్రం రికార్డు ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సహ అనేక మంది ప్రముఖుల నుంచి ప్రసంశలు వస్తున్నాయి. తాజా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈ సినిమాపై ఆసక్తికర ట్విట్ చేశారు.

శ్రీకాకుళం యాసలో ఎల్ఐసీ సీనియర్ ఉద్యోగి విజయకుమార్ రచించిన "సిత్తరాల సిరపడు" పాట లీరికల్ వీడియోను శుక్రవారం సినిమా యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జానపద గేయంపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు.

'అల.. వైకుంఠపురములో సినిమాలోకి 'సిత్తరాల సిరపడు' పాటను విని చాలా ఆనందించాను. శ్రీకాకుళ వాడుక భాషలో రాసిన జిల్లా జానపద గీతాల చరిత్రను దృష్టిలో రాసిన ఈ పాట, శ్రీకాకుళం సంస్కృతి సాహిత్యం తెలుగువాళ్ళకి చెప్పిన దర్శకులు, రచయిత, గేయకర్తకు కృతఙ్ఞతలు.'.. అంటూ ఎంపీ రామ్మోహన్ నాయుడు చేశారు. అంతే కాకుండా అల్లు అర్జున్ స్టైలిష్ ఫైట్.. ఈ పాటకు అద్భుతంగా సరిపోయింది' అని అన్నారు.

ఆడియోలో దాచిన పాట 'సిత్తరాల సిరిపడు' థియేటర్‌లో ప్రేక్షకుల చేత కేకలు పెట్టిచింది. క్లైమెక్స్ లో ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. థీయేటర్ లో ఈలల వేయించిన ఈ పాట నెట్టింట్లో కూడా చక్కర్లు కొడుతోంది. 'ఆల.. వైకుంఠపురములో' మ్యూజికల్‌ హిట్‌గా నిలిచిన ఈ సినిమా నుంచి మరో అద్భుత సాంగ్ చేరిందని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories