కార్మిక సంఘాలు, వామ పక్షాల ఆధ్వర్యంలో ర్యాలీ, రాస్తారోకో

కార్మిక సంఘాలు, వామ పక్షాల ఆధ్వర్యంలో ర్యాలీ, రాస్తారోకో
x
Highlights

మండలంలోని వ్యాపార కేంద్రం అడ్డు రోడ్డులో సీపీఎం మండల కార్యదర్శి ఎం.సత్యన్నారాయణ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ, రాస్తా రోకో నిర్వహించారు.

ఎస్.రాయవరం: మండలంలోని వ్యాపార కేంద్రం అడ్డు రోడ్డులో సీపీఎం మండల కార్యదర్శి ఎం.సత్యన్నారాయణ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ, రాస్తా రోకో నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర బంద్, దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా ఇక్కడ నిరసన ర్యాలీ, బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా సత్యన్నారాయణ మాట్లాడుతూ... ప్రభుత్వం తీసుకొస్తున్న లేబర్ కోడ్స్ ను అన్ని కార్మిక సంఘాల వ్యతిరేకిస్తున్నాయన్నారు.

కార్పోరేట్ శక్తులకు మోదీ ప్రభుత్వం అనుకూలంగా కార్మిక చట్టాలను మార్పు చేస్తున్నదని, వాటిని అందరూ వ్యతిరేకించాలని అన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎనిమిది గంటల పని విధానాన్ని 9 గంటలుగా మార్పు చేయడాన్ని కార్మీకుల హక్కుని హరించడమేనని తెలిపారు. కనీస వేతనం 21 వేల రూపాయలు చేయాలని, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించడంతోపాటు ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, వర్తింప జేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories