ఆత్మకూరు పట్టణంలో నిరసన ర్యాలీ, రాస్తారోకో

ఆత్మకూరు పట్టణంలో నిరసన ర్యాలీ, రాస్తారోకో
x
Highlights

రిజర్వేషన్ పై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని నిరశిస్తూ రిజర్వేషన్లు కొనసాగించాలని, దేశవ్యాప్తంగా జరుగుతున్న బంద్ లో భాగంగా ఎస్టీ, ఎస్సీ, బిసి, మైనార్టీ నాయకులు ప్రజా సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ర్యాలీ రాస్తారోకో చేపట్టారు.

ఆత్మకూరు: రిజర్వేషన్ పై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని నిరశిస్తూ రిజర్వేషన్లు కొనసాగించాలని, దేశవ్యాప్తంగా జరుగుతున్న బంద్ లో భాగంగా ఎస్టీ, ఎస్సీ, బిసి, మైనార్టీ నాయకులు ప్రజా సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ర్యాలీ రాస్తారోకో చేపట్టారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల పక్రియను సవరించేలా సుప్రీం కోర్టు నిర్ణయాన్ని పునరాలోచించాలని, రిజర్వేషన్ యథావిధిగా కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో వుందని.

రిజర్వేషన్ విధానం రద్దు నిరసిస్తూ ఆత్మకూర్ పట్టణం సత్రం సెంటర్ నుండి సోమశిల రోడ్డు సెంటర్ వరకు ర్యాలీ అనంతరం మానవహారంగా ఏర్పడి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ...రిజర్వేషన్ ఎత్తివేతకు కేంద్రప్రభుత్వ ఆలోచనలో భాగంగా ఈ చర్యలకు శ్రీకారం జరిగినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీ రాస్తారోకో లో ఆత్మకూరు చెందిన ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories