తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సియం రమేష్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సియం రమేష్
x
Highlights

అభివృద్ధి చేందాలంటే ప్రజలు బిజేపిని గెలిపించాలని బిజేపి రాజ్యసభ సభ్యుడు సీఎం. రమేష్ కోరారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామి వారి...

అభివృద్ధి చేందాలంటే ప్రజలు బిజేపిని గెలిపించాలని బిజేపి రాజ్యసభ సభ్యుడు సీఎం. రమేష్ కోరారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనాతరం ఆయనకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం పలుకగా. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేసారు.

అనంతరం ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడుతూ. యూకే నుండి‌ మన దేశాని వచ్చిన కొందరిలో కొత్త రకం వైరస్ లక్షాణాలు ఉండి పాజిటివ్‌ రావడం జరిగిందని, ప్రజలందరిని, రాష్ట్రాన్ని కాపాడమని స్వామి వారిని ప్రార్ధించినట్లు ఆయన తెలిపారు. బిజేపి పార్టికి దేశమంతా మంచి ఫలితాలు వచ్చాయని, రాబోవు రోజుల్లో అభివృద్ధి కావాలంటే ప్రజలందరూ ఏపిలో కూడా బిజేపి గెలిపించాలని సీఎం రమేష్ కోరారు. తిరుపతి సీటు జనసేనకి కేటాయించిన బిజేపి,జనసేన రెండు కలిసి పని చేస్తాయని స్పష్టం చేసారు.

Show Full Article
Print Article
Next Story
More Stories