ఈనెల 31న వైసీపీలో చేరుతా : టీడీపీ ఎమ్మెల్యే

ఈనెల 31న వైసీపీలో చేరుతా : టీడీపీ ఎమ్మెల్యే
x
Highlights

మరో నెలలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఏపీలో వలసలు ఊపందుకున్నాయి. వైసీపీకి చెందిన కీలక నేత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ఆ...

మరో నెలలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఏపీలో వలసలు ఊపందుకున్నాయి. వైసీపీకి చెందిన కీలక నేత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నారు. మరోవైపు టీడీపీకి చెందిన ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి ఈనెల 31న వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. మంగళవారం సాయంత్రం తన ఇద్దరు సోదరులతో కలిసి లోటస్ పాండ్ లో జగన్ ను కలిసి మేడా పార్టీలో చేరికపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గంజాయి వనం నుంచి జగన్‌ తులసి వనంలోకి వచ్చినట్లుగా ఉందని అన్నారు.

దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని ప్రస్తుతం సొంత ఇంటికి వచ్చిన భావన కలుగుతోందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలు లేని చంద్రబాబు దగ్గర ఉండలేకపోయామని అందుకే ఇన్నాళ్లు పార్టీకి దూరంగా ఉన్నానని తెలిపారు. ఈనెల 31న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ ద్వారా వచ్చిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పదవులకురాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన లేఖను బుధవారం స్పీకర్ కు పంపిస్తానన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories