రేపు పెద్దాపురంలో న్యాయవాదుల జెఎసి సమావేశం

రేపు పెద్దాపురంలో న్యాయవాదుల జెఎసి సమావేశం
x
Highlights

తూర్పు గోదావరి జిల్లాలో జ్యుడీషియల్ కమిషన్, ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో రెడ్ బ్యాడ్జ్‌లు ధరించి జనవరి 22 న (నేడు) కోర్టుకు హాజరుకావాలని...

తూర్పు గోదావరి జిల్లాలో జ్యుడీషియల్ కమిషన్, ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో రెడ్ బ్యాడ్జ్‌లు ధరించి జనవరి 22 న (నేడు) కోర్టుకు హాజరుకావాలని తూర్పు గోదావరి జిల్లా న్యాయవాదుల జెఎసి కన్వీనర్ ఎం సుబ్బారావు పిలుపునిచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ప్రభుత్వం తూర్పు గోదావరి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జనవరి 23 న పెద్దాపురంలో న్యాయవాదులు జెఎసి సమావేశం కానున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జెఎసి అధ్యక్షుడు, కార్యదర్శి తదితరులు పాల్గొంటారని ఆయన స్పష్టం చేశారు.

కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేస్తుండంతో ఇతర ప్రాంతాలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఎక్కడో శ్రీకాకుళం ఉన్న ప్రజలు కర్నూలుకు వెళ్లే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వం పునరాలోచించి తూర్పు గోదావరి జిల్లాలో జ్యుడీషియల్ కమిషన్, ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలనీ ఆయన కోరారు.

కాగా ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందులో భాగంగా కర్నూలు లో న్యాయ రాజధాని (జీడీషియల్ క్యాపిటల్), అమరావతిలో శాసన రాజధాని (లెజిస్లేచర్ క్యాపిటల్) , విశాఖలో కార్యనిర్వాహక రాజధాని (ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్) లను ఏర్పాటు చేయాలనీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన బిల్లును కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టి పాస్ చేసింది. ప్రస్తుతం కౌన్సిల్ లో ఈ బిల్లు పెండింగ్ లో ఉంది. ఇక్కడ ఆమోదం పొందగానే ఈ బిల్లును గవర్నర్ కు పంపిస్తారు. గవర్నర్ ఆమోదం పొందగానే అమల్లోకి వస్తుంది. అయితే ఈ తతంగం అంతా పూర్తవడానికి మరో ఆరునెలలు అయినా పట్టే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు తెలియజేస్తున్నారు.

ఇదిలావుంటే నిన్న ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రవేశపెట్టిన రూల్ 71పై తీర్మానం నెగ్గింది. రూల్ 71 తీర్మానానికి అనుకులంగా 27, వ్యతిరేకంగా 13,తటస్థంగా 9 ఓట్లు పడ్డాయి. ఓటింగ్ సమయంలో టీడీపీ చెందిన ఇద్దరు సభ్యులు పోతుల సునీత, శివనాథ్ షాక్ ఇచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories