Rajahmundry IMA Doctors: మానవత్వాన్ని చాటుకుంటున్న రాజమండ్రి ఐఎంఏ వైద్యులు

Rajahmundry IMA Doctors: ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారితో గజగజ వణుకుతున్నాయి. ఈ వైరస్ నుంచి సమాజాన్ని రక్షించేందుకు డాక్టర్లు యోధుల పనిచేస్తున్నారు.
Rajahmundry IMA Doctors: ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారితో గజగజ వణుకుతున్నాయి. ఈ వైరస్ నుంచి సమాజాన్ని రక్షించేందుకు డాక్టర్లు యోధుల పనిచేస్తున్నారు. ఈ తరుణంలో కొవిడ్ రోగులపై కరుణ చూపి తమ మానవత్వాన్ని చాటుకోవడానికి ముందుకొచ్చిన రాజమండ్రి ఐ ఎం ఏ వైద్యులు ముందుకు వచ్చారు. 45రోజుల పాటు రాజమండ్రి- జిజిహెచ్ , జిఎస్ఎల్ కొవిడ్ ఆస్పత్రిలలలో రోజుకి రెండు షిప్ట్ లలో కరొనా రోగులకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) వైద్యసేవలు అందించనున్నది. కరోనా విజృంభన నేపథ్యంలో ఐ ఎం ఏ రాజమండ్రి శాఖ స్వచ్చందంగా ఈ నిర్ణయం తీసుకోవడం హర్షనీయం.
ఈ సందర్భంగా ఐఎంఏ రాజమండ్రి శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రామరాజు, సెక్రటరీ డాక్టర్ పిడుగు విజయకుమార్,కోశాధికారి డాక్టర్ రామమోహన్ రావులు మాట్లాడుతూ.. సామాజిక బాధ్యత,సామాజిక స్పృహ తో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. విధుల నిర్వహణకు నేటి నుంచే 45రోజుల రోస్టర్ రూపొందించామని తెలిపారు. రోజుకి రెండు షిప్ట్ ల చొప్పున సేవలందిస్తున్నమనీ, ఒక్కొక్క షిష్ట్‌లో ఒక డ్యూటీ డాక్టర్, ఒక స్పెషలిస్ట్ ఫిజీషియన్, ఒక మత్తు (ఎనస్థీషియన్) డాక్టర్ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ విధంగా ప్రభుత్వాసుపత్రిలో ఆరుగురు, జి.ఎస్.ఎల్ లో ఆరుగురు వైద్యులు విధులు నిర్వహిస్తారు. ప్రతిరోజూ ఉదయం 8నుంచి మధ్యాహ్నం 2గంటల వరకూ, అలాగే మధ్యాహ్నం 2నుంచి 8గంటల వరకూ విధులు నిర్వహిస్తారని తెలిపారు.