Rajahmundry milk incident: కల్తీ పాల ఘటన తాజా అప్డేట్స్.. కిడ్నీ సమస్యలతో చిన్నారులు చికిత్సలో కొనసాగింపు

Rajahmundry milk incident
x

Rajahmundry milk incident: కల్తీ పాల ఘటన తాజా అప్డేట్స్.. కిడ్నీ సమస్యలతో చిన్నారులు చికిత్స

Highlights

Rajahmundry milk incident: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో కిడ్నీ సమస్యలకు గురైన చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 24 గంటలు గడిస్తేనే ఆరోగ్య స్థితిపై స్పష్టత ఉంటుందని వైద్యులు తెలిపారు.

కల్తీ పాల ఘటనలో కిడ్నీ సమస్యలకు గురైన చిన్నారులు ప్రస్తుతం రాజమండ్రిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యుల పర్యవేక్షణలో వారికి ప్రత్యేక వైద్య సేవలు అందుతున్నట్లు సమాచారం.

చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దే ఉండి పరిస్థితిని గమనిస్తున్నారు. పిల్లల ఆరోగ్యంపై స్పష్టత రావాలంటే కనీసం 24 గంటలు గడవాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.

ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. చిన్నారుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందన్నదానిపై వైద్యులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అధికార యంత్రాంగం కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories