దక్షిణ కోస్తాకు వర్షసూచన

దక్షిణ కోస్తాకు వర్షసూచన
x
Highlights

తూర్పు మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేడు(బుధవారం) ఏపీలోని దక్షిణ కోస్తా తోపాటు...

తూర్పు మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేడు(బుధవారం) ఏపీలోని దక్షిణ కోస్తా తోపాటు యానాం, పుదుచ్చేరి, కరైకల్‌ తమిళనాడు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే రేపు (గురువారం) పొడి వాతావరణం నెలకొంటుందని స్పష్టం చేసింది. హెచ్చరికలు జారీ చేసిన ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు కేంద్ర వాతావరణ శాఖ అధికారులు.

తమిళనాడులో ముఖ్యంగా కడలూరు, నాగపట్నం, తంజావూరు, తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, నీలగిరి, కోయంబత్తూర్, తిరువల్లూ, వెల్లూ, కాంచీపురం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తేని, తూత్తుకుడి, తిరునెల్వేలి, రామనాథపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి చెన్నై, శివారు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అంతేకాకుండా, కాంచీపురం మరియు మామల్లపురం తేలికపాటి వర్షపాతం నమోదయింది. తిరువన్నమలై జిల్లాలో బుధవారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories