Rain Alert: తెలుగు రాష్ట్రాలకు నేడు వర్ష సూచన

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు నేడు వర్ష సూచన
x
Highlights

Rain Alert: అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది. అది మరో రెండు రోజులపాటు ఉంటుంది. ఆ తర్వాత బలహీనపడుతుంది. ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీ, తెలంగాణపై...

Rain Alert: అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది. అది మరో రెండు రోజులపాటు ఉంటుంది. ఆ తర్వాత బలహీనపడుతుంది. ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీ, తెలంగాణపై దీని ప్రభావం లేదని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించలేదు. అయితే తెలంగాణలో నేడు, రేపు మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

శాటిలైట్ అంచనాలను చూస్తే నేడు తెలుగు రాష్ట్రాల్లో రోజంతా మేఘాలు వస్తు, పోతుంటాయి. ఉదయం 11 తర్వాత రాయలసీమ, ఉత్తర తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత సాయంత్రం వరకు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మొత్తంగా ఇవాళ రేపు రెండు రాష్ట్రాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది.

తెలంగాణలో సాధారణంగా గంటకు 11 కిలోమీటర్ల గాలివేగం ఉంటుంది. ఏపీలో గంటకు 12 కిలోమీరట్లుగా ఉంటుంది. ప్రస్తుతం గాలులన్నీ అరేబియా సముద్రంలో ఉన్న అల్పపీడనం వద్దకు వెళ్తున్నాయి. ఉష్ణోగ్రతలు చూస్తే తెలంగాణలో సాధారణంగా 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో 31 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రాత్రివేళ చలి తగ్గి, వేడి పెరుగుతుంది.

తెలంగాణలో 70శాతం తేమ ఉంటుంది. ఉత్తర తెలంగాణలో 80శాతం ఏపీలో తేమ సాధారణంగా 66శాతం ఉంటే..రాయలసీమలో మాత్రం 80శాతానికి పైగా ఉంటుంది. మొత్తం నేడు ఉత్తర తెలంగాణ, రాయలసీమకు మోస్తరు వర్ష సూచన కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories