విశాఖకు రైల్వేజోన్ కేటాయిస్తూ రైల్వే మంత్రి ప్రకటన

విశాఖకు రైల్వేజోన్ కేటాయిస్తూ రైల్వే మంత్రి ప్రకటన
x
Highlights

ఉత్తరాంధ్ర ప్రజలకు కేంద్ర రైల్వే శాఖా మంత్రి పీయూష్ గోయెల్ శుభవార్త అందించారు. ఎప్పటినుంచో పెండింగులో విశాఖకు రైల్వే జోన్ కేటాయిస్తూ అధికారికంగా...

ఉత్తరాంధ్ర ప్రజలకు కేంద్ర రైల్వే శాఖా మంత్రి పీయూష్ గోయెల్ శుభవార్త అందించారు. ఎప్పటినుంచో పెండింగులో విశాఖకు రైల్వే జోన్ కేటాయిస్తూ అధికారికంగా ప్రకటించారు గోయెల్. దీంతో దశాబ్దాలుగా పెండింగులో ఉన్న ఉత్తరాంధ్ర ప్రజల కళ సాకారమైనట్టయింది. ఈ రైల్వే జోన్ కు సౌత్ కోస్ట్ రైల్వే గా నామకరణం చేశారు. ఎల్లుండి(శుక్రవారం) ప్రధాని మోడీ పర్యటనకు ముందుగా ఈ ప్రకటన వచ్చింది. దీనికోసం కోసం అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా శ్రమించాయి. గతంలో రైల్వే జోన్ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది. ఆ తరువాత ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు గుడివాడ అమర్నాధ్, బొత్స సత్యనారాయణ, టీడీపీలో చేరబోతున్న కొణతాల రామకృష్ణ విశాఖ రైల్వే జోన్ కోసం పోరాటాలు కొనసాగించారు. రైల్వే జోన్ ప్రకటనతో విభజన హామీల్లో కీలకమైన హామీ నెరవేర్చినట్టయింది కేంద్ర ప్రభుత్వం.

Show Full Article
Print Article
Next Story
More Stories