రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం : రాహుల్ గాంధీ

రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా..  ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం :  రాహుల్ గాంధీ
x
Highlights

దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ...

దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. తిరుపతిలో తారకరామ మైదానంలో కాంగ్రెస్‌ భరోసా యాత్ర నిర్వహించింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఈ బహిరంగ సభలో పాల్గొన్నారు. ముందుగా ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న మునికోటికి నివాళి అర్పించారు రాహుల్. అనంతరం మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఇదే వేదిక సాక్షిగా ప్రధాని మోదీ చెప్పారని.. కానీ ఇవ్వలేదని మోడీపై మండిపడ్డారు. ప్రత్యేక హోదా కేవలం ప్రధాని ఇచ్చిన వాగ్దానం కాదు.. దేశంలోని ప్రతిపౌరుడు ఏపీకి ఇచ్చిన వాగ్దానంగా భావిస్తున్నాం అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో రూ.70 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామని రాహుల్ అన్నారు.

ప్రధానిగా ఆంధ్రప్రదేశ్ మోదీ ఇచ్చిన ఎ ఒక్క హామీని కూడా ఇప్పటివరకు అమలు చేయలేదని రాహుల్‌ ధ్వజమెత్తారు. రాఫెల్‌ విషయంలో అంబానీకి రూ.30 వేల కోట్లు దోచిపెట్టారని, కాపలాదారుడే దొంగ అని ప్రజలు అంటున్నారని చెప్పారు. మోదీ పారిశ్రామిక వేత్తలకు రుణమాఫీ చేశారని, రైతులకు మాత్రం రుణమాఫీ చేయడం లేదని రాహుల్ విమర్శించారు. ఇక అంతకుముందు రాహుల్ గాంధీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకొని సంప్రదాయ పద్దతిలో మేనల్లుడుతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు రాహుల్ గాంధీ.

Show Full Article
Print Article
Next Story
More Stories