తన ఇల్లు, కార్యాలయంపై సీబీఐ దాడుల వార్తలపై ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందన

తన ఇల్లు, కార్యాలయంపై సీబీఐ దాడుల వార్తలపై ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందన
x
Highlights

తన ఇల్లు, కార్యాలయంపై సీబీఐ దాడుల వార్తలపై ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందన సీబీఐ దాడులు జరుగుతున్నాయంటూ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీ..

తన నివాసం, కార్యాలయాలపై సీబీఐ దాడులు జరుగుతున్నాయంటూ మీడియాలో ప్రచారం జరుగుతోందంటూ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. అయితే తన ఇల్లు, కార్యాలయాలపై ఎలాంటి సోదాలు జరగడంలేదని ఆయన స్పష్టం చేశారు. సీబీఐ సోదాలు అన్న వార్త తనకు మీడియా ద్వారానే తెలిసిందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ నివాసంలో కానీ, హైదరాబాద్ నివాసంలో కానీ, తన నియోజకవర్గంలో కానీ ఎక్కడా సీబీఐ దాడులు జరగలేదని రఘురామకృష్ణరాజు వివరణ ఇచ్చారు.

అంతేకాదు ఒకవేళ సీబీఐ సోదాలు చేస్తే అందుకు సంబంధించిన సమాచారాన్ని కూడా తమకు ఎవరూ ఇవ్వలేదని ఆయన తెలిపారు. మీడియాలో చూపిస్తున్న ఇళ్లు ఎవరివో, ఎక్కడివో మరి అంటూ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. కాగా 2019 నరసాపురం నియోజవర్గం నుంచి వైసీపీ తరఫున ఎంపీగా గెలిచారు. అయితే ఆ పార్టీతో విభేదించి బీజేపీకి దగ్గరయ్యారు. ఇటు వైసీపీ కూడా ఆయనపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ ఇచ్చింది. అయితే స్పీకర్ మాత్రం వైసీపీ లేఖపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories